రోల్, కెమెరా, యాక్షన్!
ఫిల్మ్ మేకింగ్‌లో డిజిటల్ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత
సినిమా నిర్మాణం చాలా కష్టమైన పని . అది షార్ట్ ఫిల్మ్, వెబ్ టీవీ షో లేదా సినిమా ఏదైనా కావచ్చు . చిత్రీకరణ చాలా కష్టం ఇది నిజం. మీరు కేవలం నటీనటులు లేదా సాంకేతిక నిపుణులతో మాత్రమే పని చేయడం లేదు. మీరు డజన్ల కొద్దీ లేదా వందల కొద్దీ అదనపు, లైటింగ్ సిబ్బంది, ప్రొడక్షన్ సిబ్బంది మరియు సహాయక సిబ్బందికి కూడా నేతృత్వం వహిస్తున్నారు.
ఈ వ్యక్తులలో కొందరు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టుల పైన పని చేస్తుండొచ్చు . అందుకే ప్రీ ప్రొడక్షన్ టైంలో, సెట్స్ లో , పోస్ట్ ప్రొడక్షన్ టైం లో వేగవంతమైన , కచ్చితమైన డిజిటల్ కమ్యూనికేషన్ అవసరం. కానీ ఇంత పెద్ద మరియు వందల మంది పని చేసే చిత్ర సిబ్బంది తో మీరు కమ్యూనికేషన్‌ను ఎలా నిర్వహిస్తారు?
సైలెంట్‌గా ఉండే సినిమా సెట్‌లో ఎప్పుడైనా వెళ్లారా? లేదు కదా? ఎందుకంటే వందల మంది చిత్ర సిబ్బందిని సమన్వయము చేస్కోవడం, సూచనలు ఇవ్వడం , కమ్యూనికేషన్ అనేది చాలా కష్టతరం . అసంపూర్ణమైన కమ్యూనికేషన్‌తో ప్రారంభమైనప్పుడు, మరిన్ని తప్పులు జరుగుతాయి మరియు మొత్తం నిరాశాజనకమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తమ పనిని ముందే తెలుసుకుని, దానికి కావలసిన సూచనలు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసినప్పుడు, రోజు చిత్రీకరణ వేగంగా జరుగుతుంది మరియు పండుగ వాతావరణం ఉంటుంది.
అందుకే సినిమా సెట్‌లో వేగవంతమైన , కచ్చితమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరికి వారికి కావలసిన సమాచారం, ఫైల్స్ , అప్డేట్స్ వారికి చిటికెలో ఉంచుతుంది. తప్పులు జరగడానికి ఆస్కారం లేదు.
మంచి,వేగవంతమైన , కచ్చితమైన డిజిటల్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి? Crafter తో అది ఎలా జరగబోతోంది?
మీ సినిమా సెట్‌లో Crafter డిజిటల్ కమ్యూనికేషన్ ఉన్నట్లయితే మరియు ప్రతి ఒక్కరూ బాగా కమ్యూనికేట్ చేసుకోగలిగి , చిత్రీకరణ సాఫీగా సాగుతుంది, పొరపాట్లకు తక్కువ సమయం వృధా అవుతుంది మరియు సమయం బాగా ఉపయోగించుకో గలుగుతారు . చిత్రబృందంలోని ప్రతి వ్యక్తికి ఆ రోజు వారి పని ఏమిటో ముందే తెలియడం వల్ల చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. సమయం అనేది డబ్బు, అక్షరాలా. సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఆహ్లాదకరమైన మరియు ఆకర్షణీయమైన వాతావరణాన్ని సెట్స్ లో సృష్టిస్తుంది
సమయం విలువైనది
లొకేషన్ ఖర్చులు మరియు ఎక్విప్‌మెంట్ రెంటల్‌తో పాటు, సినిమా సెట్‌లో సాధారణంగా చాలా మంది సిబ్బందికి ఏ రోజుకు ఆ రోజు చెల్లింపులు జరుగుతాయి. దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, లైటింగ్ ఇంజనీర్లు, సౌండ్ ఇంజనీర్లు, ఇతర ప్రొడక్షన్ అసిస్టెంట్లు, గ్రిప్స్ మరియు కెమెరా ఆపరేటర్ల నుండి. ప్రతి డిపార్టుమెంటుకి గణనీయమైన ఖర్చు ఉంటుంది. కమ్యూనికేషన్ లోపాలు సమయాన్ని వృధా చేస్తాయి మరియు ప్రొడక్షన్ బడ్జెట్‌కు గణనీయమైన మొత్తంలో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.
మంచి,వేగవంతమైన , కచ్చితమైన డిజిటల్ కమ్యూనికేషన్ ఒక ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని చేస్తుంది
మీరు సానుకూల ఆలోచనలు ఉన్న చిత్ర బృందంతో కలిసి, పని చేసినప్పుడు చాలా వేగంగా షూటింగ్స్ జరుగుతాయి . మంచి సినిమా తీయచ్చు. తక్కువ ఖర్చుతో , తక్కువ టైం లో అద్భుతమైన చిత్రాన్ని తీయొచ్చు ! దీనికి విరుద్ధంగా,నిరాశ పూరితంగా ఉన్నట్లయితే, పొరపాట్లు ఏర్పడతాయి, తద్వారా షూటింగ్స్ కి ఎక్కువ రోజులు అవుతాయి . ఖర్చు ఎక్కువ. సానుకూల, ముందస్తు కమ్యూనికేషన్, సానుకూల మరియు ప్రతికూల అనుభవాల మధ్య వ్యత్యాసాన్ని కలిగిస్తుంది.
చిత్ర బృందం సభ్యులు ప్రీ ప్రొడక్షన్, షూటింగ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ లో ఒకరితో ఒకరు Crafter యాప్ తో ఎలా సమర్ధవంతంగా సంభాషించగలరు?
చిత్ర బృందం సభ్యులు ఒకరితో ఒకరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడే కొన్ని ఫీచర్స్ ఈ ఆప్ లో ఉన్నాయి.
ఓపెన్ ఛానెల్స్
ఒక సెట్లో, స్థిరమైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. ఓపెన్ ఛానెల్‌లు మొత్తం చిత్ర బృందం సభ్యులు, సిబ్బందిని మరియు సమాచారాన్ని ఒకే స్థలంలో తీసుకువస్తాయి. వారు షూటింగ్ అప్‌డేట్‌లు, నిబంధనలు , ఫైల్‌లు, ఆలోచనలు అన్నీ పంచుకోగలరు. కలిసి నిర్ణయాలు తీసుకోగలరు మరియు ఉమ్మడి లక్ష్యం తో కలిసి పనిని ముందుకు తీసుకెళ్లగలరు.
సాధారణంగా, ప్రతి రోజు ఆ రోజు షూటింగ్ జాబితా మరియు ఆ రోజు షూటింగ్ లక్ష్యాల గురించి తెలుసుకోవడానికి ఆల్-హ్యాండ్ ప్రొడక్షన్ అప్‌డేట్‌తో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఇది. Crafter లోని ఈ ఫీచర్‌తో ఇది తక్షణమే జరుగుతుంది . షూటింగ్ లేదా ప్రొడెక్షన్ రోజు యొక్క అవలోకనాన్ని పొందడానికి మరియు రోజు లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి ప్రతి చిత్ర బృందం సభ్యులు, సిబ్బందికి ఇది గొప్ప మార్గం. ప్రతి ఒక్కరూ ఆ రోజు నిర్దేశించబడిన అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోజును ప్రారంభిస్తే, మీరు చేసే ప్రతి పని ,ఆ లక్ష్యానికి చిత్ర బృందం సభ్యులు, సిబ్బంది మద్దతు దొరుకుతుంది .
చిత్ర బృందం సభ్యులు, సిబ్బందికి ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉంటే, వారు తక్షణమే వారి డిపార్ట్‌మెంట్ హెడ్‌ని నేరుగా సందేశం ద్వారా తనిఖీ చేయవచ్చు. సమయం అనేది డబ్బు, కాబట్టి సినిమా మొత్తం నిర్మాణాన్ని వెనక్కి నెట్టివేసే ప్రమాదం కంటే చిత్రీకరణ ప్రారంభించే ముందు వివరణాత్మక ప్రశ్నలు అడగడం చాలా మంచిది.
ప్రొడక్షన్ హెడ్స్ రోజంతా ఓపెన్ ఛానెల్‌లను ఉపయోగించవచ్చు. అప్‌డేట్‌లను క్లుప్తంగా మరియు స్పష్టంగా ఉండేలా చూసుకోవచ్చు , సూచనలు సరిగ్గా ఉపయోగించుకోవడం వాళ్ళ మరియు ప్రతి చిత్ర బృందం సభ్యులు, సిబ్బంది మీ సూచనలు చదివారని మరియు అర్థం చేసుకున్నారని నిర్ధారణ చేయవచ్చు.
ప్రైవేట్ ఛానెల్‌లు
ప్రధాన సిబ్బందికి ఎల్లప్పుడూ స్క్రిప్ట్ మరియు ప్రొడక్షన్ నోట్స్ కాపీని చూడలేరు. అయితే, వారు చూసి అర్థం చేసుకున్నప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చిత్రీకరణ యొక్క మొత్తం దిశ గురించి వారికి స్పష్టమైన ఆలోచనను ఇస్తుంది. షూట్ దృష్టిలో ఉంచుకుని వారు తమ రోజును ప్రారంభించినప్పుడు, అన్ని షాట్స్ మరింత అర్ధవంతంగా ఉంటాయి. కాల్ షీట్, షాట్ లిస్ట్ లేదా స్టోరీబోర్డ్‌లు కూడా ప్రతి రోజు ముందుగా సమీక్షించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజు ఎవరికి ఎక్కడ అవసరం మరియు ఏ సమయానికి చేరుకోవాలో చూపించడానికి ఇది షెడ్యూల్‌ను వివరంగా తెలియజేస్తుంది.
సున్నితమైన లేదా రహస్య సంభాషణల కోసం, వారు Crafterలో ప్రైవేట్ ఛానెల్‌లను ఉపయోగించవచ్చు. ఆహ్వానించబడిన వారు మాత్రమే ఛానెల్‌ని వీక్షించగలరు లేదా శోధనలో దాని కంటెంట్‌లను కనుగొనగలరు.
ఉత్పాదకత పెరుగుతుంది
ప్రతి సిబ్బంది ఛానెల్ వాడుతున్నాడు వలన , సంభాషణలు, ప్రకటనలు, అప్‌డేట్‌లు మరియు ఫైల్‌లు అన్ని అందుబాటులో ఉంటాయి . ప్రతి ఒక్కరూ అడగవలసిన సమాధానాలను కనుగొనవచ్చు, సందర్భాన్ని పొందవచ్చు మరియు మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వీటి అన్నిటివల్ల ఉత్పాదకత పెరుగుతుంది .
ప్రస్తుతం సెట్స్‌పై చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతోంది?
చాలా సార్లు కమ్యూనికేషన్ తప్పుగా జరుగుతుంది. . ఫిల్మ్ సెట్‌లో, చాలా పనులూ ఉన్నాయి మరియు ప్రతిదీ వేగంగా జరుగుతుంది . ఎవరైనా అభ్యర్థనను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, అది చాలా పెద్ద దెబ్బ తీస్తోంది . దాని కన్నా వాటిని ముందుగానే నిరోధించడం ఉత్తమం . చిత్ర బృందం సభ్యులు ప్రతి ఒక్కరూ సూచనలను అర్థం చేసుకున్నారని Crafter ఆప్ తో ముందుగా తనిఖీ చేస్కోవచ్చు మరియు ముందస్తు మరియు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ద్వారా ప్రొడక్షన్ అద్భుతంగా చేయొచ్చు .
మంచి కమ్యూనికేషన్‌కు కొన్ని అడ్డంకులు ఏమిటి?
Crafter వంటి సాఫ్ట్‌వేర్‌తో కమ్యూనికేషన్ డిజిటల్‌కి తరలించడం ఉత్తమ కమ్యూనికేషన్ శైలి. ఫిల్మ్ సెట్‌లో జీవితాన్ని సవాలుగా మార్చే కొన్ని సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్దతులు ఉన్నాయి, కానీ గుర్తుంచుకోండి,సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్దతులు గందరగోళాన్ని పెంచుతాయి మరియు విషయాలను నెమ్మదిస్తాయి. సమయం పరిమితం మరియు ఉత్తమమైన కమ్యూనికేషన్ పద్ధతి — డిజిటల్ ఎందుకంటే ఇది త్వరగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది.
సిగ్గు అనేది సెట్‌లో మరొక సమస్యాత్మక లక్షణం. ఎవరైనా చిత్ర బృందం సభ్యులు సిగ్గరి అయినప్పుడు , వారు ఆ బలహీనత అధిగమించడానికి ఉండటానికి ఈ డిజిటల్ మార్గాలను సహాయపడుతుంది. మీరు అంతిమ లక్ష్యంతో వారిని ప్రేరేపించగలరు. ఎవరైనా చిత్ర బృందం సభ్యులు చాలా మాట్లాడేవారైతే, మీరు వారికి రోజు లక్ష్యాలను కూడా గుర్తు చేయవచ్చు, షూటింగ్ టైంలో చాటింగ్‌లో సమయం వృధా చేసుకోకుండా . సినిమా సెట్‌లో సమయం చాలా విలువైంది కాబట్టి , ఆ రోజు చిత్రీకరణ పూర్తయ్యే వరకు పనికి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్‌లను డిజిటల్‌గా ఉంచండం ఉత్తమం .
చివరి మాట
Crafter టీమ్ కమ్యూనికేషన్ యాప్ చలనచిత్రంనిర్మాణం లో ఉన్నప్పుడు సెట్‌లో ఉన్నప్పుడు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ పద్దతి మరియు చిత్రీకరణను షెడ్యూల్‌లో ఉండటానికి సహాయపడుతుంది. ఇది ప్రతిఒక్కరూ వారి రోజు వారి పాత్ర మరియు విధులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది ప్రొడక్షన్ , షూటింగ్ సమాచారం, విజ్ఞప్తులు, నిబంధనలు స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉండటానికి సహాయపడుతుంది. సిబ్బంది అవసరమైతే వివరణ కోసం అడగవచ్చు. ఇలా వారంతా షూట్ రోజు ఉత్తేజంగా ప్రారంభించవచ్చు మరియు ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పనిని పూర్తి చేయగలరు. ఒక ప్రొడక్షన్ హౌస్ రోజు చిత్రీకరణ విజయవంతం కావాలని కోరుకుంటే. సినిమా సెట్‌లో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా మరియు వృత్తిపరంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, అందరికి ప్రొడక్షన్ సంబందించిన పనులు, లక్ష్యాలు, కొట్టిన పిండిలా ఉంటాయి . Crafter దానిని నిజం చేస్తుంది.
సినిమా మీద ప్రేమతో,
నవతేజ్ ,
Crafter ,Inc.
Image credits : Online